ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, జర్నలిస్ట్ కర్రోళ్ళ నవజిీవన్ బహుజన సాహిత్య అకాడమీ “డా. బాబాసాహెబ్ అంబేద్కర్” జాతీయ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బహుజన సాహిత్య అకాడమీ 6వ రాష్ట్ర మహాసభలో జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ అందించారు. కాగా తనను అవార్డుకు సిఫారసు చేసిన రాష్ట్ర కమిటీ మెంబర్ ముక్కెర సంపత్ కుమార్ కు, రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎం.గౌతమ్ కు, జాతీయ కార్యదర్శి విజయలలితకు నవజీవన్ కృతజ్ఞతలు తెలిపారు.
