మంచిర్యాల నియోజకవర్గం..
మంచిర్యాల పట్టణంలో పాత్రికేయ సమావేశం నిర్వహించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
అనంతరం వారు మాట్లాడుతూ రేపు మంచిర్యాల , నస్పూర్ మున్సిపాలిటీల్లో జరగబోయే ప్రజా ఆశీర్వాద సభ మరియు కార్మిక గర్జన సభల్లో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు..
రేపు జరగబోయే కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి దీపదాస్ మున్సి గారు,ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ , మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ, నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..
