రాయపోల్ మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో రోడ్లు గుంతలు పడడంతో వాహనదారులకు ఇబ్బంది కలుగుతున్న సందర్భంగా మంగళవారం రాత్రి బిజెపి ఎస్సీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మంకిడి స్వామి ఆధ్వర్యంలో మానుక యాదగిరి కిరాణా షాప్ నుండి తీగూల చంద్రం ఇంటి వరకు మరియు బేగంపేట్ నుండి యెల్కల్ రోడ్డులో ఎరుకలి బిక్షపతి పొలం కల్వర్ట్ నుండి సబిస్టేషన్ రోడ్డు వరకు డస్ట్ తో పూర్తిగా గుంతలను 12 గంటల నుండి తెల్లవారు జామున మూడు గంటల వరకు రోడ్లపై గుంతలను పూడ్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒకటోవ వార్డు మెంబెర్ మానుక శ్యామల, సుదర్శన్, యాదవ్, బిజెపి బేగంపేట్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, తిప్పని ప్రవీణ్, గజం హరీష్, పెంజర్ల కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
