ప్రాంతీయం

డిఈఓకు వినతి పత్రం అందించిన బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు…

109 Views

ముస్తాబాద్, అక్టోబర్ 23 రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత కొన్ని రోజులుగా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రైవేట్ పాఠశాలలకు అవసరమైన చర్యలు తీసుకోగలరని అదేవిధంగా పలు ప్రయివేట్ పాఠశాలలు సెలవు రోజుల్లో స్పెషల్ క్లాసుల పేరిట అదనపు తరగతులు నిర్వహించడంతోపాటు విద్యార్థులు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాథమిక సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కంచెల రవిగౌడ్ డీఈఓకు వినతి పత్రం అందించి విజ్ఞప్తి చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, గడదాస్ మహేష్, పలువురు నాయకులు వెంకటేష్ ముద్దం అనిల్ గౌడ్ నవీన్ ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found