పత్రికల చానల్స్ యాజమాన్యాల ఒత్తిడి వల్ల విలేకరుల జీవితాలు బలవుతున్నాయి. ఈరోజు ప్రైమ్ నైన్ యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక తాడేపల్లిగూడెం రిపోర్టర్ రావూరి చెన్నకేశవ మరణించారు. యాజమాన్యం యాడ్స్ కోసం ఒత్తిడి చేయడం వల్ల, వడ్డీకి తెచ్చి అడ్వాన్స్ చెల్లించటం, టార్గెట్లు ఎక్కువగా పెంచడం, అడ్వాన్స్ మళ్లీ తెమ్మని ఒత్తిడి చేయడం వల్ల చెన్నకేశవ పొద్దుటి నుండి యాడ్లు కోసం తిరిగి తిరిగి తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ కు వచ్చి పడిపోయి మరణించాడు. యాజమాన్యాల జీతాల ఇవ్వక, యాడ్స్ కోసం ఒత్తిడి చేయడం వల్ల అనేకమంది విలేకరులు గతంలో మరణించారు. రెండు సంవత్సరాల క్రితం రాజమండ్రి స్టాఫ్ రిపోర్టర్ జుట్ట గణపతి యాజమాన్యాల ఒత్తిడి తో అప్పులు చేసి ,యాడ్స్ బిల్లులు చెల్లించి కుటుంబాన్ని పోషించలేక అప్పులు తీర్చలేని పరిస్థితిలో మరణించారు. జనవరి రాకతో కోరలు తెంచుకున్న విషపు నాగుల్లాగా కొన్ని పత్రికల, న్యూస్ ఛానళ్ల ఎండీలు, సీఈవోలు, హెచ్ఆర్ లు,, మార్కెటింగ్ హెడ్ లు, ఇన్ పుట్ ఎడిటర్లు ఇలా వరుస బ్లాక్మేయిలింగ్ వ్యవహారాలతో రిపోర్టర్స్ నిత్యనరకం చూస్తూన్నారు.
