Breaking News

రైతు రుణమాఫీకి తాము వ్యతిరేకం..పార్లమెంటులో ప్రకటించిన అమిత్‌ షా*

122 Views

*రైతు రుణమాఫీకి తాము వ్యతిరేకం..పార్లమెంటులో ప్రకటించిన అమిత్‌ షా*

*ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెడుతున్న రైతన్న రు ణాన్ని మాఫీ చేయడం తప్పా.?*

*ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డవారిని ఆదుకొనే పథకాలు, నిర్ణయాలను తాయిలాలంటూ వెక్కిరిస్తామా..?*

అయితే, ప్రధాని నరేంద్రమోదీకి, కేం ద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ఇవన్నీ తప్పులుగానే కనిపిస్తున్నాయి. అందుకే, పార్లమెంట్‌ సాక్షిగా రైతు రుణమాఫీని, ప్రజా సంక్షేమ పథకాలను అమిత్‌ షా అవహేళన చేశారు.

రుణమాఫీకి మేం వ్యతిరేకం: అమిత్‌షా

పార్లమెంట్‌ సాక్షిగా అమిత్‌ షా వెల్లడి

కార్పొరేట్లకు 15 లక్షల కోట్లు రైటాఫ్‌

రుణమాఫీ రేవ్‌డీ అయితే కార్పొరేట్లకు రైటాఫ్‌ ఏంటి?

రైతుల రుణమాఫీతో లక్షల కుటుంబాల్లో బీఆర్‌ఎస్‌ వెలుగులు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయాలతో అందరికీ సమన్యాయం

9 ఏండ్లలో 40,528 కోట్ల రుణ మాఫీ

ఇప్పటికే ప్రజాసంక్షేమాన్ని పలుచనచేసిన మోదీ సర్కారు.. ఇప్పుడు పేదల సంక్షేమాన్నీ పరిహసిస్తున్నది. రుణమాఫీకి తాము వ్యతిరేకమంటూ పార్లమెంటులోనే హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. మరి కేంద్రం కార్పొరేట్లకు రైటాఫ్‌ చేసిన 14.56 లక్షల కోట్ల సంగతేంది? తాము కార్పొరేట్లకు ఇస్తే అది సంక్షేమం.. ఇతరులు పేదలకు ప్రయోజనం చేకూరిస్తే అది రేవ్డీ!

మోదీ రేవ్‌డీ అంటాడు రుణమాఫీకి అమిత్‌ షా ‘నై’ అంటాడు తాయిలాలకు మేం వ్యతిరేకమంటాడు కానీ, కార్పొరేట్లకు మాత్రం లక్షల కోట్ల రుణాలను రైటాఫ్‌ చేస్తారు ఇది తాయిలం కాదా? దేశ ఆస్తులను అడ్డగోలుగా తెగనమ్ముతారు ఇది వ్యాపార దృక్పథం అనిపించుకోదా? ఇలాంటి రైతు, ప్రజా వ్యతిరేక బీజేపీకా మనం ఓటేసేది?

సంక్షేమ పథకాలు మనవి.. కమర్షియల్‌ స్కీమ్‌లు వాళ్లవి.రైతు, పేదల పక్షపాత విధానాలు మనవి.. కార్పొరేట్లకు దోచిపెట్టే పాలసీలు వాళ్లవి.ఇదీ బీఆర్‌ఎస్‌కు.. బీజేపీకి ఉన్న తేడా!

హైదరాబాద్‌, ఆగస్టు (నమస్తే తెలంగాణ)/(స్పెషల్‌ టాస్క్‌ బ్యూరో): ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెడుతున్న రైతన్న రు ణాన్ని మాఫీ చేయడం తప్పా?! ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డవారిని ఆదుకొనే పథకాలు, నిర్ణయాలను తాయిలాలంటూ వెక్కిరిస్తామా? అయితే, ప్రధాని నరేంద్రమోదీకి, కేం ద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ఇవన్నీ తప్పులుగానే కనిపిస్తున్నాయి. అందుకే, పార్లమెంట్‌ సాక్షిగా రైతు రుణమాఫీని, ప్రజా సంక్షేమ పథకాలను అమిత్‌ షా అవహేళన చేశారు. రైతు రుణమాఫీకి తాము వ్యతిరేకమని ప్రకటించారు. సంక్షేమ పథకాలను కూడా తాయిలాల కింద జమకడుతూ వాటికి తాము దూరమని పేలా రు. రైతులకు తమ ప్రభుత్వం రుణమాఫీ చేయబోదని తేల్చిచెప్పిన మంత్రి.. అసలు రైతులు రుణాలు తీసుకోకూడని పరిస్థితిని తీసుకొస్తామంటూ ఎప్పటిలాగే గప్పాలకు పోయారు. తొమ్మిదేండ్ల హయాంలో రైతులు, పేద, మధ్యతరగతి వర్గాల కోసం బీజేపీ సర్కారు ఏం చేసింది? అన్నదాతలు, పేద, మధ్యతరగతి వర్గాల కోసం తెలంగాణలోని కేసీఆర్‌ ప్రభు త్వం ఏం చేసింది? ఇప్పుడు అందరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.

*రైటాఫ్‌లు తాయిలాలు కాదా?*

రుణమాఫీకి తాము దూరమని సుద్దులు వల్లిస్తున్న అధికార బీజేపీ బ్యాంకుల నుంచి కార్పొరేట్లు అడ్డగోలుగా తీసుకొన్న రుణాలను రికార్డు స్థాయిలో రైటాఫ్‌ చేసింది. 2014 నుం చి 9 ఆర్థిక సంవత్సరాల్లో రూ.14,56,226 కోట్ల మొండి బకాయిల రైటాఫ్‌ జరిగింది. ఇం దులో కార్పొరేట్లకు సంబంధించినవే రూ. 7,40,968 కోట్లు ఉన్నాయి. ఈ మేరకు కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌కు సోమవారం వెల్లడించింది. తొమ్మిదేండ్లలో రూ.14,56,226 కోట్ల మొండి బకాయిలను రైటాఫ్‌ చేసిన బ్యాం కులు.. వసూలు చేసింది మాత్రం 2,04,668 కోట్లే. అంటే రికవరీ రేటు కేవలం 14 శాతమే. అప్పును తిరిగి చెల్లించే స్థోమత ఉన్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే రుణాలను ఎగ్గొట్టే విల్‌ఫుల్‌ డిఫాల్ట్‌ల సంఖ్య (ఉద్దేశపూర్వక ఎగవేతలు) బీజేపీ హయాంలో ఏకంగా పది రెట్లు పెరిగిం ది. 2022 డిసెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల సంఖ్య 16,044గా ఉన్నట్టు పలు బ్యాంకుల నివేదికలను బట్టి తెలుస్తున్నది. మొత్తంగా వీళ్లు రూ.3,46,479 కోట్ల రుణాలను కావాలనే ఎగ్గొట్టినట్టు సమాచారం. ఇందులో 85 శాతం రుణాలను ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచే తీసుకొన్నట్టు తెలుస్తున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలను తీ సుకొని విదేశాలకు పారిపోయిన విజయ్‌ మా ల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ తదితరులు విల్‌ఫుల్‌ డిఫాల్టర్లేనని (ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు) సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వేసిన ఓ పిటిషన్‌కు ప్రభుత్వమే బదులిచ్చింది. కాగా, రైతుల రుణమాఫీని రేవడీగా అభివర్ణించిన కేంద్రం.. కార్పొరేట్ల రుణాల రైటాఫ్‌లకు ఏ పేరు పెడుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

*తెలంగాణ.. సామాజిక సంక్షేమ బాట*

మాఫీ చేయడం అంటే ఉచితంగా డబ్బులు పంచడం కాదు.. రేవడీ (తాయిలాలు) ఇవ్వడం కాదు. పేద, మధ్యతరగతి జీవులకు ఆర్థికంగా భరోసా ఇవ్వడం. రైతన్న భవిష్యత్తుపై నమ్మకం కల్పించడం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిందదే. రుణాల మాఫీ, పన్నుల రద్దుతో రాష్ట్రంలో లక్షల కుటుంబాలకు అండగా నిలిచారు. వారి నెత్తి మీది నుంచి రూ.వేల కోట్ల భారాన్ని దించారు. సీఎం కేసీఆర్‌ తీసుకొన్న నిర్ణయాలు ఏ ఒక్క వర్గానికో పరిమితం కాలేదు. అన్ని వర్గాలకు సమన్యాయం దక్కింది. రైతులు, చేనేతలు, గీతకార్మికులు, వాహనాన్ని నడుపుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న కార్మికులకు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారు.

*రైతన్నకు రుణమాఫీ*

సీఎం కేసీఆర్‌ అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ ప్రకటించారు. రూ.లక్ష లోపు ఉన్న బ్యాంకు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి, అమలు చేశారు. ఫలితంగా 35 లక్షల మంది రైతు కుటుంబాలు రుణవిముక్తి అయ్యాయి. రెండో విడత అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి రూ.లక్ష వరకు పంట రుణాల మాఫీ పథకాన్ని అమలు చేశారు. ఈ సారి మరోసారి 35 లక్షలకుపైగా కుటుంబాలను అప్పు నుంచి విముక్తి కలిగింది. 2018లో మొదటి విడతలో రూ.36వేలలోపు ఉన్న రూ.1,207 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. తాజాగా రూ.లక్ష లోపు రుణం ఉన్న 29.61 లక్షల మంది రైతులకు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించింది. ఇదే సమయంలో రైతులు మరోసారి అప్పు చేసి తిప్పలు పడాల్సిన అగత్యం రాకుండా.. రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. సీజన్‌ ప్రారంభానికి ముందే ఎకరాకు రూ.10వేలు వేస్తూ పెట్టుబడికి సాయమందిస్తున్నారు.

*9 ఏండ్లలో ఎవరు ఎలా*

*బీజేపీ సర్కారు*

మొత్తం రైటాఫ్‌ల విలువ 14,56,226 కోట్లు

మోదీహయాంలో లబ్ధిపొందినవారు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ తదితరులు

*బీఆర్‌ఎస్‌ సర్కారు*

వివిధవర్గాలకు చేసిన రుణమాఫీ 40,528 కోట్లు

కేసీఆర్‌ హయాంలో లబ్ధిపొందినవారు రైతన్నలు, నేతన్నలు, గౌడన్నలు, పేద, మధ్యతరగతివర్గాలు

నేతన్నకు విముక్తి

2021లో చేనేత రుణమాఫీ పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 2010 నుంచి 2017 మధ్య నేత కార్మికులు తీసుకొన్న రుణాలను రూ.లక్ష వరకు ప్రభు త్వం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు.

లబ్ధి: 10,148 మంది మాఫీ మొత్తం: రూ.28.97 కోట్లు

గౌడన్నకు లబ్ధి..

తాటి, ఈత చెట్లు గీసి, కల్లు అమ్ముకొని జీవనోపాధి సాగించే గీత కార్మికులు ఒక చెట్టుకు ఏటా పట్టణాల్లో అయితే రూ.50, గ్రామీణ ప్రాంతాల్లో రూ.25 చెల్లించాల్సి వచ్చేది. ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.16 కోట్లు జమయ్యేది. రాష్ట్రవ్యాప్తం గా పట్టేదార్లకు రూ.50-100 కోట్ల వరకు చేరేవి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌడన్నలకు అండగా నిలబడ్డారు. తాటి/ఈత చెట్లపై పన్ను విధించే విధానానికి స్వస్తి పలికారు. ఫలితంగా 2,18,107 మంది గీత కార్మికులకు లబ్ధి చేకూరింది.

లబ్ధి: 2,18,107

మాఫీ మొత్తం:రూ.144కోట్లు

కల్లు దుకాణాల అద్దె మాఫీ

గ్రామాల్లో, పట్టణాల్లో కల్లు దుకాణాలు ఏర్పాటు చేస్తే స్థానిక సంస్థలు పన్నులు వసూలు చేసేవి. ఇలా ఏటా రూ.16 కోట్ల వరకు పన్నులు వసూలు చేసేవి. సీఎం కేసీఆర్‌ పెండింగ్‌లో ఉన్న అద్దెలను మాఫీ చేశారు.

లబ్ధి: 2,18,107 మంది

మాఫీ మొత్తం: రూ.8 కోట్లు

ఆటో కార్మికులకు అండ

బతుకుదెరువుకు ఆటోలు, ట్రాక్టర్లు నడుపుకొనేవారు రాష్ట్రంలో లక్షల్లో ఉన్నారు. చాలీచాలని సంపాదనతో బతుకీడుస్తున్న వారిపై.. వాహన పన్నులు పిడుగులా మారేవి. ఈ సమస్యను సీఎం కేసీఆర్‌ మానవీయ కోణంలో ఆలోచించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2014 జూన్‌ 30 వరకు ఉన్న వాహన పన్ను బకాయిలను రద్దు చేశారు.

లబ్ధి: 5 లక్షలు

మాఫీ మొత్తం: రూ.76.26 కోట్లు

30 లక్షల ఇండ్లమీద అప్పు మాఫీ

పేదల సొంతింటి కలను, అప్పుతో ముడిపెట్టి నాటి ప్రభుత్వాలు కష్టపెడితే.. రూ.3,920 కోట్ల గృహరుణాలను మాఫీ చేసి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల నెత్తిన పాలుపోశారు సీఎం కేసీఆర్‌.

లబ్ధి:29,64,435

మాఫీ మొత్తం: రూ.3,920 కోట్లు

2014 కంటే ముందు ఉద్దేశ పూర్వక ఎగవేతల విలువరూ.25 వేల కోట్లు

బీజేపీ తొమ్మిదేండ్ల హయాంలో విల్‌ఫుల్‌ డిఫాల్ట్స్‌ పెరుగుదల10 రెట్లు

2022 చివరినాటికి ఉద్దేశపూర్వక ఎగవేతల విలువరూ.3.46 లక్షల కోట్లు

*తొమ్మిదేండ్ల బీజేపీ హయాంలో మొత్తం రైటాఫ్‌ల విలువరూ.14.56 లక్షల కోట్లు*

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *