ప్రాంతీయం

బాబా సాహెబ్ అంబేడ్కర్ స్ఫూర్తితో చదవాలి

108 Views

రాజన్న సిరిసిల్ల – జ్యోతి న్యూస్

* SFI రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్

* సిఐటియు కార్యాలయంలో పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది

బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శం తీసుకొని చదవాలని , ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ అన్నారు. ఎస్ఎఫ్ఐ వేములవాడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది.. ప్రపంచ మేధావి , భారతరత్న గ్రహీత బాబా అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి ,ఉన్నత చదువులు చదివి భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. కానీ మతోన్మాద బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడిచే విధంగా పరిపాలిస్తుందని అన్నారు. నూతన జాతీయ విద్య విధానం తీసుకొచ్చి విద్యార్థులను ముంచే విధంగా బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నుతుంది అని అన్నారు. తక్షణమే నూతన జాతీయ విద్య విధానం రద్దు చేయాలని ప్రశాంత్ కోరారు.. అంబేద్కర్ స్ఫూర్తితో చదివి పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థి పై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జాలపల్లి మనోజ్ కుమార్, నాయకులు అనిల్, రాకేష్, సాయి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Anugula Krishna