డా,బి ఆర్ అంబేడ్కర్ 66 ” వర్థంతి ” సందర్భంగా ఈరోజు మార్కేట్ కమిటీ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో లోని డా. బి ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ చదువుకునేటప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కోవడం జరిగిందని కానీ ఏనాడు కూడా చదువును నిర్లక్ష్యం చేయలేదన్నారు. ఆ చదువే అంబేడ్కర్ ను ప్రపంచ మేధావిని చేసిందని అంబేడ్కర్ చైర్మన్ గా భారత దేశానికి రాజ్యాంగము అందించి అందరి జీవితలలో వెలుగులు నింపిన మహనీయులు అని కొనియాడారు. ఎన్నో మతాలు భాషలు కలిగిన భారతదేశం లో అందరికీ న్యాయం జరిగేలా చట్టాలను రూపొందించి ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలను పాలించే విధానాన్ని తెచ్చి దేశంలోని ప్రజలందరికీ న్యాయం జరిగేలా చూశారన్నారు. ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం ఆ చట్టం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతంగా రాజ్యాంగముగా పెరు పొందడం విశేషం అన్నారు… రాజ్యాంగం చూపిన చూపుడు వెలు దారిలో నడిచి దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనేది అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనమందరం ఆచరణలో కొనసాగించాలని అన్నారు…ఈ కార్యక్రమములో మార్కేట్ సెక్రటరీ జాంవెస్లీ,ఆత్మకమిటి చైర్మన్ ఊడేం కృష్ణా రెడ్డి, కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, బొగ్గుల చందు, టౌన్ ప్రెసిడెంట్ నవాజ్ మీరా,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మతీన్, ప్రవీణ్, రూబెన్, మాసపక యాదగిరి,సుపర్వైజర్ మహిపాల్, తెరాస నాయకులు సాయిరెడ్డి, శివ కుమార్ మార్కెట్ అమ్మకందారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




