సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో బుధవారం గ్రామ తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బత్తిని బాలయ్య గౌడ్ హైమావతి కుమార్తె స్వేత వివాహానికి,అలాగే కీర్తిశేషులు కంటి బిక్షపతి లక్ష్మి కుమార్తె ప్రవళిక వివాహానికి పుస్తె మట్టెలు అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రావి కంటి చంద్రశేఖర్ సేవలు అభినందనీయమని ఒకే రోజు ఇద్దరు పెళ్లికూతుర్లకు రెండు జతల పుస్తే మట్టెలు అందజేయడం గొప్ప విషయం అని గ్రామంలో అందరికి అందుబాటులో ఉంటూ సమాజ సేవే లక్ష్యంగా సేవ చేస్తున్న రావికంటి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు అనంతరం రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవా అని మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆర్బిపి మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటుచేసి ఆ ట్రస్టు ద్వారా గ్రామంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సేవ చేయడంలో తృప్తి ఉంటుందని ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉప సర్పంచ్ రమేష్, స్వామి, రాచకొండ ఆంజనేయులు, గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు నర్సోల్ల స్వామి, కొండపోచమ్మ మాజీ డైరెక్టర్ దొడ్డి మల్లేష్ అంబేద్కర్ సంఘం నాయకులు, కర్కపట్ల రాజు, బత్తిని శ్రీనివాస్, నాగరాజు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
