ప్రాంతీయం

కేకే, కండువాలు వేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం..100, మందికి పైగా చేరికలు…

235 Views

ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 18, మండలంలోని మోర్ర పూర్ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామశాఖ అధ్యక్షులు గోవర్ధన్ నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరణ చేసినారు. వారి ఆధ్వర్యంలో 100 మందికి పైచిలుకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ రాష్ట్రంలో ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నాడు, కొత్త రేషన్ కార్డు లేవు. కొత్త పింఛలు లేవు. డబల్ బెడ్ రూమ్ లేవు. ఇంటికో ఉద్యోగం అన్నాడు ఊరుకో ఉద్యోగo లేదు. దళితిలకు మూడు ఎకరాల భూమి లేదు. దళిత బందు లేదు, నిరుద్యోగ భృతి లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ లేదు కానీ కేసీఆర్ ఇంట్లోనే నలుగురికి ఉద్యోగాలు ఈరాష్ట్రాన్ని దోచుక తిన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని మాట తప్పినటువంటి దౌర్భాగ్యుడు కేసీఆర్. రైతులకు రుణమాఫీ లేదు గిట్టుబాటు ధర లేదు . బిస్వాల్ కమిటీ ప్రకారము ఉద్యోగాలు నిర్వహించడం లేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీతో పాటు రెండు లక్షల ఉద్యోగాలు నిర్వహించి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి రైతులకు వడ్లకు 2600 రూపాయలకు పైచిలుకు కల్పించి ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా పరిపాలన అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో బుక్యా రమేష్, బాదావత్ ప్రవీణ్, మాలోత్ సురేందర్, భూక్య మహేష్, సంతోష్, నరేష్, అనిల్, తులసమ్మ, పుష్పలత, మారోని, మీరవ్వ, నరేష్, సురేష్, జాన్, బీమ్ నాయక్, నారాయణ, ఎల్ రమేష్ ,సాయి, సంతోష్, మోహన్, శంకర్ నాయక్, పంతులు నాయక్, రాజు, బాధావత్ రమేష్, మహేష్, రాము తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *