రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్ లో మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దేశ్ పాండే మరియు ముస్తాబాద్ రాజు గురుస్వామి ఆధ్వర్యంలో జిల్లా మరియు మండలాల ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చక్రధర్ రెడ్డి , ఉపాధ్యక్షులు పెద్దిరాజు, రాగుల ప్రశాంత్, నాగి సంతు, ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి లక్ష్మీనారాయణ, సంయుక్త కార్యదర్శి, శ్రీ గాధ అశోక్ చారి, గౌరవ అధ్యక్షులు ఎరుకల ప్రకాష్ గురు స్వామి, గౌరవ సలహాదారులు వూచ్చిడి రాజు గురుస్వామి, సాంస్కృతిక శాఖ డబ్బు దేవయ్య, మహేష్, కార్యవర్గ సభ్యులుగా కందుకూరి రవి పిట్టల తిరుమన్ , రేపాక ఎల్లయ్యలను ఎన్నుకోవడం జరిగింది తదనంతరం ఆర్యవైశ్య భవన్ లో జిల్లా కార్యవర్గం తో పాటు మండలాల కార్యవర్గాల సభ్యులను దేశ్ పాండే గురుస్వామి రాజు గురు స్వామి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారోత్సవం జరిపించారు ఈ కార్యక్రమంలో అల్మాస్పూర్ శీను గౌడ్ గురుస్వామి వేములవాడ గాన గంధరుడు రాజు గౌడ్ స్వామి ఎరుకలి ప్రకాష్ గురు స్వామి నాగిరెడ్డి గురుస్వామి మరియు అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు
