ప్రాంతీయం

అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించిన ఎం జె పి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ

134 Views

జగదేవపూర్ మండలం గొల్లపల్లి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ లో  డా. బి ఆర్ అంబేడ్కర్ 66 వ వర్ధంతి  సందర్భంగా మంగళవారం ప్రిన్సిపల్ శ్రీలత ఆధ్వర్యంలో డా. బి ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు  అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ చదువుకునేటప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కోవడం జరిగిందని కానీ ఏనాడు కూడా చదువును నిర్లక్ష్యం చేయలేదన్నారు.  ఆ చదువే అంబేద్కర్ ను ప్రపంచ మేధావిని చేసిందని   అంబేడ్కర్ చైర్మన్ గా భారత దేశానికి రాజ్యాంగం అందించి అందరి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయులు అని కొనియాడారు. ఎన్నో మతాలు భాషలు  కలిగిన భారతదేశం లో అందరికీ న్యాయం జరిగేలా చట్టాలను రూపొందించి ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజలను పాలించే విధానాన్ని తెచ్చి దేశంలోని ప్రజలందరికీ న్యాయం జరిగేలా చూశారన్నారు.  ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం ఆ చట్టం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతంగా రాజ్యాంగంగా పేరు పొందడం విశేషం అన్నారు. రాజ్యాంగం చూపిన చూపుడు వెలు దారిలో నడిచి దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనేది అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనమందరం ఆచరణలో కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏటిపి అనురాగిణి, లీలా, పీఈటి రవీందర్, యాద లక్ష్మి, తిరుపతి, బిక్షపతి, బాలరాజ్, యాదయ్య, రాజు, కే రాజు, మనెమ్మ జయ స్వామి మహేష్ పరుశరాములు నర్సింగరావు సుష్మ ప్రవీణ్ ప్రభాకర్, శ్రీహరి, అటెండర్, విద్యార్థులు వారితో పాటు ఇన్స్టిట్యూట్ సిబ్బంది పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7