ప్రాంతీయం

ఘనంగా మల్లికార్జున స్వామి కళ్యాణం

95 Views
  1. చందుర్తి – జ్యోతి న్యూస్

చందుర్తి మండలం మండలం నర్సింగాపూర్ గ్రామంలోని వెలిసిన శ్రీ మోహిని కుంట మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం కార్యక్రమం ఆదివారం అంగరంగా వైభవంగాజరిగింది. ఈ సందర్భంగా అర్చకులు స్వామి వారి కళ్యాణాన్ని కన్నుల పండగ వైభవంగా నిర్వహించారు.కళ్యాణ మహోత్సవ వేడుకలో వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండి సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.,సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి,పంటలు సమృద్ధిగా పండి ఈ ప్రాంతం. ప్రజలందరూ చల్లగా ఉండేలా ఆ భగవంతుని ఆశిషులు ఎల్లవేళలా ప్రజలందరిపై ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి. జోగాపూర్ ఎంపీటీసీ మ్యాకల మేకల గణేష్, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్. సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్. నాయకులు పొన్నాల శ్రీనివాసరావు. దప్పుల అశోక్. ఎలుకల తిరుపతి,కాసారపు శ్రీనివాస్ రెడ్డి,పూడురి జీవన్ రెడ్డి,దారం చంద్రం,సార శ్రీనివాస్,అజయ్ రెడ్డి బొజ్జ రాజయ్య,ఎర్రం శ్రీమన్నారాయణ, ఎదురుగట్ల అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Anugula Krishna