గజ్వేల్ పట్టణంలో (లోక్ నేత్ర ట్రస్ట్) గజ్వేల్ కంటి హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలోని ప్రజలు హైదరాబాద్ వెళ్ళవలసిన పని లేకుండా వ్యాపార రంగమేగాని వైద్యరంగమే గాని హైదరాబాదు నుంచి ఇక్కడ అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కంటికి సంబంధించిన ఎటువంటి సమస్యలైనా పరిష్కరించడానికి ప్రముఖ వైద్యాన్ని పునుగులచే గజ్వేల్ కంటి హాస్పిటల్ ప్రారంభించుకున్నారు. గజ్వేల్ నుండి పోటీ చేసి కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గజ్వేల్ ఎంతో అభివృద్ధి చెందిందని, దేశంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో నెంబర్ వన్ స్థానంలో గజ్వేల్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మున్సిపల్ వైస్ చైర్మన్ 15వ వార్డు కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య మరియు హాస్పటల్ యాజమాన్యం డాక్టర్లు మున్సిపల్ కౌన్సిలర్లు పట్టణ నాయకులు పట్టణంలోని డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.




