రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొన్న దౌల్తాబాద్ మండలం గువ్వలేగి కి చెందిన సాత్వికను మెదక్ పార్లమెంట్ సభ్యులు, సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి అభినందించారు. గువ్వలేగిలో సాత్వికను అభినందించి ఆర్థిక సాయం అందించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సాత్విక చదువుతోపాటు క్రీడలతో క్రీడలలో కూడా రాణించడం అభినందనీయమన్నారు. పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బాలికలు సాత్వికను ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో ముందుకు సాగాలన్నారు.
