మంచిర్యాల జిల్లా.
79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో ఘనంగా జెండ ఆవిష్కరణ
ఈరోజు శ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేసి స్కూల్ పిల్లలకు బుక్స్ పెన్నులు స్వీట్స్ పంచిపెట్టి, తదినంతరం చెల్ల విక్రమ్ గారు మాట్లాడుతూ, మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటివరకు ఆటో కార్మికుల డ్రైవర్ల బ్రతుకులు మారలేదని ఇప్పటికైనా పాలకులు ఆలోచించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరినారు ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ గౌరవ అధ్యక్షులు గోలేటి శివ, శ్రీరాంపూర్ ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
