మంచిర్యాల జిల్లా.
వికసిత్ భారత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి- రఘునాథ్ వెరబెల్లి
79 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా కార్యాలయం నుండి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీ లో బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొనడం జరిగింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు తమ ఇంటి పై జాతీయ జెండాను ఎగురవేయాలని రఘునాథ్ పిలుపునిచ్చారు. ఎందరో మహనీయులు త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ దిశగా గత 11 సంవత్సరాలుగా దేశం కోసం పని చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో అమీరిశెట్టి రాజ్ కుమార్, సత్రం రమేష్, గాజుల ముఖేష్ గౌడ్, పట్టి వెంకట కృష్ణ, మోటపలుకుల తిరుపతి, బియ్యాల సతీష్ రావు, ఎనగందుల కృష్ణ మూర్తి, బొలిశెట్టి అశ్విన్, కోడి రమేష్, ముదాం మల్లేష్, రంగ శ్రీశైలం, బోయిని హరి కృష్ణ, జయరామ రావు, సప్పిడి నరేష్, కర్ర లచ్చన్న, కర్రె చక్రి, బోయిని దేవేందర్, కోడి సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
