Breaking News

రుణమాఫీ కాలేదని రైతుల ధర్నా

63 Views

రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పంట రుణాలను విడతల వారీగా మాఫీ చేస్తుంటే, 2014కు సంబంధించి 697 మంది రైతుల పంట రుణాలు ఇంకా మాఫీ కాలేదంటూ దుబ్బాక మండల రైతులు బ్యాంకు ముందు మరోసారి ధర్నా చేశారుదుబ్బాక: రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పంట రుణాలను విడతల వారీగా మాఫీ చేస్తుంటే, 2014కు సంబంధించి 697 మంది రైతుల పంట రుణాలు ఇంకా మాఫీ కాలేదంటూ దుబ్బాక మండల రైతులు బ్యాంకు ముందు మరోసారి ధర్నా చేశారు. పురపాలికలోని దుంపలపల్లి, చెల్లాపూర్‌, చేర్వాపూర్‌, మండలంలోని బల్వంతాపూర్‌, రాజక్కపేట, హబ్షీపూర్‌ గ్రామాలకు చెందిన పలువురు రైతులు బుధవారం పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి డిప్యూటీ తహసీల్దార్‌ సందీప్‌కు వినతిపత్రం సమర్పించారు. 4వ వార్డు కౌన్సిలర్‌ ఇల్లెందుల శ్రీనివాస్‌, దుబ్బాక వైస్‌ ఎంపీపీ అస్క రవి మాట్లాడుతూ 2014లో రైతులు తీసుకున్న పంట రుణాల మాఫీకి సంబంధించి కేవలం దుబ్బాక ఎస్బీఐ పరిధిలో 697 మంది రైతుల రుణాలు మాఫీకాకుండా పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. పలువురు రైతులకు రుణమాఫీ జరిగినట్లు ఫోన్‌కు సంక్షిప్త సమాచారం వచ్చినా, మాఫీ జరగలేదని, రుణాలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. విషయం తెలిసిన వెంటనే సిద్దిపేట ఎస్బీఐ రీజినల్‌ మేనేజర్‌ అరుణ జ్యోతి బ్యాంకును సందర్శించి, రికార్డులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం లేదన్నారు. 2014లో రీషెడ్యూల్‌ అయిన రుణాలకు రైతులు ముందుకు వచ్చి వడ్డీ తీసేసి, కేవలం అసలు కట్టినా రెన్యూవల్‌ చేస్తామన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *