మంచిర్యాల జిల్లా.
తెలంగాణ జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు
పలు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సోమవారం, మంగళవారం, ఉమ్మడి కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి,వరంగల్, నల్గొండ జిల్లాలు కుండపోత వర్షంతో అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందం కావడంతో జనజీవనానికి ఆటంకం కలిగింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు చాలా జిల్లాల్లో 10 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. అయితే, వచ్చే మూడ్రో జులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
