Breaking News ప్రాంతీయం

ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ముంపు గ్రామస్థులు

49 Views

మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీలోని సమస్యలు, ప్యాకేజీలు పరిష్కరించాలని మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డికి వినతి పత్రం అందజేసిన గజ్వేల్ పట్టణంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలోని లక్ష్మాపూర్ తాజా మాజీ సర్పంచ్ కొలిచేలిమే స్వామి, వేముల గట్టు మాజీ ఉపసర్పంచ్ పెద్ది బాల్ కిషన్, బ్రాహ్మణ బంజరపల్లి మాజీ సర్పంచ్ మద్దూరు రాము ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముంపు గ్రామాలను గ్రామపంచాయతీలుగా కొనసాగించాలి. మున్సిపల్ లో విలీనం చేస్తే నిర్వాసితులకు పన్నుల భారం ఎక్కువవుతుందని తెలపడం జరిగింది. అర్హత కలిగి ఉండి ఇంకా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాని వారికి ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని, ఒంటరి మహిళలు మరియు ఒంటరి పురుషులకు సంబంధించి ఎలాంటి పునరావాస ప్యాకేజీ ఇప్పటివరకు ఇవ్వలేదు, వారికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చే ఆదుకోవాలని, నిర్వాసితులకు ఇచ్చిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని, పునరావాస కాలనీలో ఇంకా అపరిష్కృతంగా ఉన్న మౌలిక సదుపాయాలను సిసి రోడ్లు డ్రైనేజీలు కల్పించాలని, నిర్వాసితులకు బే షరతుగా రుణమాఫీ చేయాలని, ఆర్ అండ్ ఆర్ కాలనీ వేములగట్, ఎర్రవల్లి, సింగారం, పల్లెపాడు గ్రామాలకు స్మశానవాటిక ఏర్పాటు చేయాలని, ఆర్ అండ్ ఆర్ కాలనీలో ముఖ్యంగా లక్ష్మాపూర్, ఏటీగడ్డ కిష్టాపూర్, వేములఘాట్ లో ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. జడ్.పి.హెచ్.ఎస్ ఆర్ అండ్ ఆర్ స్కూల్ 2022- 23 సంవత్సరంలో ఏర్పాటు చేయడం వలన కొత్తగా ఏర్పడ్డ స్కూల్లో సైన్స్ ల్యాబ్ మరియు ఫర్నిచర్ సౌకర్యాలు కల్పించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమం లో వీరితోపాటు బిఆర్ఎస్ గ్రామ పార్టి అధ్యక్షులు పల్లిపాటి కనక గౌడ్ నాయకులు గణపురం మల్లేశం, ఆర్ అండ్ ఆర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka