మంచిర్యాల జిల్లా
బొక్కలగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.
బొక్కలగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమర్రికి చెందిన సాయి వెంకటేష్ అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.తన బైక్ మీద పని నిమిత్తం మంచిర్యాలకు వెళ్లి, పని అనంతరం అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణంలో తన బైక్ మీద వస్తుండగా మార్గమథ్యంలో బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ దేవాలయం వద్ద లారీ అతని బైక్ ను ఢీకొట్టడంతో అతనికి తీవ్రగాయలు అయ్యాయి. మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు చేర్చగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
