మంచిర్యాల జిల్లా.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు!
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బీసీ రిజర్వేషన్లపై అధికార పార్టీ నాలుగైదు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పిఎసి సమావేశాన్ని ఈ నెల 16 లేదా 17వ తేదీన నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలిపారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతుంది, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంశం తేలేకపోవడంతో పార్టీ పరంగా ఎన్నికలను అమలు చేయాలని చూస్తుంది.
కాగా ఇప్పటికే గుజరాత్ నుంచి 37,530 బ్యాలెట్ బాక్స్ లను హైదరాబాద్ కు తరలించినట్టు తెలుస్తుంది, రెండు మూడు రోజుల్లో జిల్లాల వారీగా అవి పంపిణీ చేయమన్నారు.
