ప్రాంతీయం

పోలీసుల వాహన తనిఖీలు. పలువురు వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు.

47 Views

ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి రాచర్ల కళాశాల వద్ద కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఎల్లారెడ్డి పేట ఎస్ ఐ మాలోతు తుకారాం ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.
పలువురికి బ్రీత్ ఎనలైజర్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ ఐ తుకారాం మాట్లాడుతూ వాహన దారులు మద్యం సేవించి వాహనాలు నడుపరాదని తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడిపే వారినీ కోర్టుకు పంపుతామని కోర్టు మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి జరిమానాలు విధించడం,జైలుకు కూడా పంపే పరిస్థితి ఉంటుందని ఆ పరిస్థితులను గుర్తించి వాహన దారులు మద్యం సేవించి వాహనాలు నడుపకుండా ఉండాలని ఎస్ ఐ తెలిపారు.
ప్రతి వాహన దారులు వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్లు,ఇన్సూరెన్స్,డ్రైవింగ్ లైసెన్స్ కలిగి వుండాలని సూచించారు.
ఈ తనిఖీల్లో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు చెందిన పలువురు పోలీస్ లు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *