Breaking News

బిజెపి జిల్లా కార్యాలయంలొ స్థానిక సంస్థల ఎన్నికల సమావేశం

8 Views

మంచిర్యాల జిల్లా.

బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు బిజెపి జిల్లా కార్యాలయంలొ స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలొ ముఖ్య అతిధిగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్  పాల్గొన్నారు. మరియు స్థానిక సంస్థల ఎన్నికల మంచిర్యాల జిల్లా ప్రభారీ ఎడ్ల అశోక్ రెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికల మంచిర్యాల జిల్లా కన్వినర్ వెరబెల్లి రఘునాథ్, పెద్దపల్లి పార్లమెంట్ నుండి MP అభ్యర్థిగా పోటీ చేసిన గోమాసే శ్రీనివాస్ పాల్గొని నాయకులకు దిశ నిర్థిష చేయడం జరిగింది.

ఈ సందర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎన్నికల్లో గెలిచే దిశగా ప్రతీ ఒక్కరు పూర్తి సమయం ఇచ్చి పనిచెయ్యాలి అని కొరారు. రాష్ట్ర పార్టీ సూచన మేరకు ప్రతీ మండలానికి ఒక ఎన్నికల ప్రభారీని ఒక కన్వినర్ ని నిర్ణయించడం జరిగింది అని వారు పూర్తి సమయంతొ సమన్వయంతో పని చెయ్యాలి అని కోరారు.

ఈ సందర్బంగా ముఖ్య అతిధి దుగ్యాలా ప్రదీప్  మాట్లాడుతూ ఈరోజు జిల్లా కార్యశాలలో జరిగిన విషయాలన్నీ ప్రతీ మండలల్లో బూత్ స్థాయి నాయకుల వరకు చేర్చాలని కోరారు. గత పది సంవత్సరాలు BRS పార్టీ వేల కోట్ల రూపాయలు దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ. అబద్దపు, అసత్యపు హామీలు ఇచ్చి గద్దనేక్కిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుండి దేశానికి చేసిన ద్రోహన్ని గుర్తు చేస్తూ. దేశం కోసం ధర్మం కోసం పని చేస్తున్నా పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా జెండా ఎగారావేస్తాము అని ధీమా వ్యక్తం చేస్తూ. స్థానిక ఎన్నికల్లో బిజెపి నాయకుల సత్తా చూపించాలి అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కాబినెట్ నరేద్ర మోడీ  కాబినెట్ అని తెలియజేస్తూ మిషన్ 2 /27 అని చెప్పిన నరేంద్ర మోడీ  హామీని గుర్తు చేశారు. దేశంలో మారుమూల ప్రాంతలొ ఉన్న ద్రౌపతి మురుమురు ని రాష్ట్ర పతి చేసిన ఘనత బిజెపి పార్టీథి అని అన్నారు. జిల్లాలొ 9 ZPTC లు బిజెపి గెలవడం పెద్ద విషయం కాదు అని జిల్లాపర్షత్ ఛైర్మెన్ కైవసం చేసుకోవాలని కోరారు. గతంలో జరిగిన MP, MLA ఎన్నికల్లో పెరిగిన ఓట్ల శాతం వలన ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన 42% ఓట్లతో బిజెపి రాష్ట్రంలో అధికారంలో రావడానికి సిద్ధంగా ఉంది అని అన్నారు. ప్రపంచంలో 4 స్థానానికి తీసుకొచ్చిన ఘనత నరేద్ర మోడీ ది అని బిజెపి నరేంద్ర మోడీ  పాలనా వలన ప్రపంచాన్ని శాశించే దేశంగా భారత దేశం ఎదగబోతుంది అని అన్నారు. అందరు గెలిచే సంకల్పంతొ కార్యకర్తలు పని చెయ్యాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల మంచిర్యాల జిల్లా ప్రభారీ ఎడ్ల అశోక్ రెడ్డి  మాట్లాడుతూ ప్రతీ మండలాల్లో పోలింగ్ బూత్ అధ్యక్షులు ఆపై బాధ్యతలొ ఉన్న వారితొ 24,25,26 తేదీల్లో వర్క్ షాపులు నిర్వహించాలి అని మరియు 27,28 తేదీల్లో పోలింగ్ బూతులో సమావేశం ఏర్పాటు చెయ్యాలని కోరారు.

స్థానిక సంస్థల ఎన్నికల మంచిర్యాల జిల్లా కన్వినర్ వెరబెల్లి రఘునాథ్ గారు మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులు, సీనియర్ నాయకులు, రాష్ట్ర, జిల్లా బాధ్యతల్లో ఉన్నవారు ప్రతీ ఒక్కరు పోటీకి సిద్ధంగా ఉండాలని కోరారు. స్థానిక సమస్యల మీద ద్రుష్టి కేంద్రికరించాలని అన్నారు. జిల్లాలో స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు దిశగా పని చెయ్యాలని కోరారు.

పెద్దపల్లి పార్లమెంట్ నుండి MP అభ్యర్థిగా పోటీ చేసిన గోమాసే శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయింది కావున స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలిసే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి అని. ఆ అవకాశాన్ని బిజెపి నాయకులు, కార్యకర్తలు వినియోగించుకోవాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పర్వతాలు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టి వెంకట క్రిష్ణ గారు, sc మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీ గారు, మాజీ మున్సిపల్ వైస్ చెర్మన్ గాజుల ముకేశ్ గౌడ్ గారు, మాజీ MPP సురేఖ గారు, రాష్ట్ర జిల్లా నాయకులు, మండల ప్రభారీలు,మండల కన్వినర్లు, మండల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *