ఈరోజు జగదేవపూర్ మండలంలోని ధర్మారం గ్రామంలో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రైతు ఉత్పత్తిదారుల సేవా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి మరియు స్థానిక సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్ .
ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రైతులు అందరూ ఒక సమూహంలో చేరడానికి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు, ఈ సంస్థలో సభ్యత్వం తీసుకున్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు సులువుగా అందుతాయి అన్నారు, ఈ సంస్థలో సభ్యత్వం తీసుకున్న వారికి దళారుల చేతిలో మోసం లేకుండా నాణ్యమైన విత్తనాలను ఎరువులను రైతులకు కావాల్సిన సబ్సిడీలను ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థ రైతులకు అందుతాయి అన్నారు, కాబట్టి రైతులందరూ ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అహర్నిశలుగా నిరంతరంగా రైతు శ్రేయస్సు కోసమే రైతును రాజు చేయడం మీ లక్ష్యంగా కృషి చేస్తున్నారన్నారు, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మండుటెండల్లో సైతం కాలేశ్వరం ద్వారా గోదావరి జలాలను రైతుల పొలాలలోకి పంపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందన్నారు,
24 గంటల ఉచిత కరెంటును ఇస్తున్నారన్నారు, రైతుబంధు రైతు బీమా రైతులు పండించిన పంటలను గిట్టుబాటు ధరలను కల్పిస్తూ పంట కొనుగోలు చేసుకోవడం రైతులకు నాణ్యమైన విత్తనాల ఎరువుల సరఫరా చేయడం, రైతులు ఏ పంట వేయాలో చర్చించుకోవడానికి రైతు చర్చా వేదికల నిర్మాణం చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలను పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అందిస్తున్నారన్నారు, రైతులు అప్పులు తీసుకునే స్థాయి నుండి అప్పులు ఇచ్చే స్థాయి వరకు ఎదిగారన్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒక ఎకరం భూమి ధర రెండు నుండి ఐదు లక్షల అయితే ఈరోజు ఒక ఎకరం ధర కోటి రూపాయలు పలుకుతుందన్నారు,
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి,మండల BRS అద్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పీర్లపలి సర్పంచ్ యాదవ రెడ్డి,ఆత్మ కమిటీ డైరెక్టర్ జుర్రు ఐలేని,వార్డు మెంబర్లు,కో ఆప్షన్ మెంబర్లు, మండల BRS ఉపాధ్యక్షుడు నరసింహ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఖాజా విరసత్ అలి,ఏకలవ్య ఫౌండేషన్ సీఈఓ రాజేందర్ రెడ్డి,సతీష్,తిరుపతి,గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రాము, బీఆర్ ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు.తదితులున్నారు