మంచిర్యాల పట్టణం,సాయికుంటలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన చిన్నారులను పరామర్శించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.
అనంతరం దివాకర్ రావు మాట్లాడుతూ..నాలుగు రోజుల క్రితం ఆశ్రమ పాఠశాలలో పురుగుల అన్నం తినడంతో అస్వస్థత గురైన 8వ తరగతి చదువుతున్న తరుణి అనే విద్యార్థిని,ఆరో తరగతి చదువుతున్న అలకనంద రేవతి విద్యార్థినిలు. నాలుగు రోజులుగా విద్యార్థినీలు అవస్థకు గురైన కూడా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడంతో పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ పాలనలో,BRS ప్రభుత్వ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో ఆగమైపోతున్నది అని అన్నారు.కేసీఆర్ హయాంలో గిరిజన,గురుకుల పాఠశాలలు అంటే ఒక బ్రాండ్,గిరిజన, గురుకుల పాఠశాలలో సీట్ల కోసం మంత్రులు,ఎమ్మెల్యేలతో పిల్లల తల్లిదండ్రులు సిఫారసులు చేయించినా అప్పట్లో సీటు దొరకని పరిస్థితి. కానీ,ఇప్పుడా పరిస్థితి లేదు. కాంగ్రెస్ సర్కారు రాకతో గురుకుల,గిరిజన పాఠశాలల తలరాత తలకిందులైంది అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాఠశాలల్లో ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
