దౌల్తాబాద్: అఖిలభారత యాదవ సంఘం దౌల్తాబాద్ మండల అధ్యక్షులుగా సత్యంను ఎన్నుకున్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ శంభు దేవాలయం ఆవరణలో మండల యాదవ సంఘం సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. మండల అధ్యక్షుడిగా బోటుక సత్యం, యూత్ అధ్యక్షుడిగా గొల్ల రాజశేఖర్, ఉపాధ్యక్షుడిగా నరేష్ కార్యదర్శులుగా టింకు, సత్యం, కోశాధికారిగా రమేష్ తో పాటు తదితరులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ యాదవుల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని అన్నారు. మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరశురాములు, నర్సింలు, రాము, ఎల్లయ్య,సురేష్, గణేష్, దుర్గయ్య తోపాటు వివిధ గ్రామాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు..
