మంచిర్యాల జిల్లా.
**స్థలం:** న్యూ ఢిల్లీ – ఏఐసీసీ కార్యాలయం
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ని కలిసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ
ఈరోజు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఖర్గే కి పుష్పగుచ్ఛం అందజేసి, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ఉన్నత పదవుల్లో కొనసాగాలని కోరుకున్నారు.
నాయకత్వ విలువలలో నిలకడగా, దశాబ్దాల రాజకీయ అనుభవంతో దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఖర్గే కి శుభాకాంక్షలు తెలుపుతూ, కాక తో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసి మంత్రివర్యులు మరియు ఎంపీ ఆయన ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా పార్టీ, దేశ రాజకీయాలపై సాదర చర్చలు కూడా జరిగాయి.
