Breaking News

తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మ ని దగ్ధం

10 Views

మంచిర్యాల జిల్లా.

ఈరోజు Q న్యూస్ కార్యాలయం పై దాడి చేసి తీన్మార్ మల్లన్న ను హత్య చేయాలని ఉద్దేశం తో కల్వకుంట్ల కవిత మరియు వారి అనుచరులు, తెలంగాణ జాగృతి కండువాలు కప్పుకొని వచ్చి దాడికి పూనుకున్నారు. ఈ దాడిని ఖండిస్తూ తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రం లో కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మ ని దగ్ధం చేశారు. ఈ సందర్బంగా తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ మాట్లాడుతూ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న ను ఉద్దేశపూర్వకంగానే హత్య చేయించాలనే కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి కండువాలతో వచ్చిన దుండగులతో Q న్యూస్ కార్యాలయం పై దాడి చేసి మల్లన్న ను చంపాలనే పన్నాగం పన్నారని అన్నారు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే, మీరు మీ అయ్యా కేసిఆర్ తీన్మార్ మల్లన్న పై Q న్యూస్ కార్యాలయం పై ఎన్ని దాడులు చేసి, కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసినా కూడా ప్రజల పక్షాన్నే ప్రశ్నిస్తూ తెలంగాణ సమాజం గుండెల్లో చెదరని ముద్ర వేసుకున్న మల్లన్నని అంతం చేయడం అంటే యావత్ తెలంగాణ ప్రజల గొంతుకపై కాలు మోపినట్టే అని స్పష్టం చేశారు. ఇప్పటికే యావత్ తెలంగాణ సమాజాన్ని మోసం చేసిన మీ కల్వకుంట్ల కుటుంబం బ్రతుకు ఫాంహౌస్ కే పరిమితం అయింది అని మరిచిపోయావ్, ఈరోజు బీసీ ల గుండెల్లో చెదరని ముద్రవేసుకుని బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యం గా పని చేస్తున్న మల్లన్నగారిని అంతమొందించేందుకే ఈరోజు కొంతమంది వ్యక్తులను మల్లన్న మీద దాడికి ప్రేరేపించి, హత్యా యత్నానికి ఉసగొల్పిన కవితపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సెంటిమెంట్ పై, అమరవీరుల సమాధులపై రాజ్యమేలిన మీరు కుటుంబ పాలనకే తప్ప బడుగు బలహీన వర్గాలకు ఏనాడు న్యాయం చేసిన పాపాన పోలేదని అన్నారు. రానున్న రోజుల్లో తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టి, బీసీ లందరినీ ఏకం చేస్తే, ఎక్కడ వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి చరమ గీతం పాడతాడేమో అనే భయంతో ఈరోజు మల్లన్న గారిని చంపేందుకు కుట్ర పన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని దాడులు చేసినా, ఎంతమంది అడ్డుకున్న మల్లన్న బీసీ ల పార్టీ పెట్టి తీరుతారని, రానున్నరోజుల్లో వచ్చేది బీసీ ల రాజ్యమే అని స్పష్టం చేశారు. BRS పాలనలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు కొత్తగా బీసీ ల కోసం గొంతు ఎత్తాలని ప్రయత్నిస్తున్న కవితకి అసలు బీసీ లతో ఉన్న సంబంధం ఏంటో తెలపాలని ప్రశ్నించారు. అగ్రవర్ణాల జాతికి చెందిన కల్వకుంట్ల కవిత బీసీ ల పై కపటప్రేమ ప్రదర్శిస్తూ, వారి రాజకీయ భవిష్యత్తు కోసం బీసీ ముసుగు తోడుక్కొని, బీసీలను అడ్డుపెట్టుకొని దాడుల సంస్కృతిని ప్రేరేపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కవితకి బీసీ ల మీద ఉన్న ప్రేమ, బీఆర్ఎస్ అధికారం లో ఉన్నప్పుడే ఉండి ఉంటే, వీళ్ళ కుటుంబం బీసీ ల హక్కులు, అధికారాలను గుర్తించి, రాజ్యాధికారాన్ని బీసీ లకే చెందనిచ్చేవారని, కుటుంబ పాలనతో ఆస్తులు కూడబెట్టుకొని, ప్రజల్ని ఇలా ఇబ్బందులకు గురిచేసేవారు కాదని వివరించారు. ఎన్ని ఎత్తుగడలు వేసినా, అగ్రవర్ణాల ఆధిపత్యం నుండి బీసీలను కాపాడేందుకు, బహుజనుల రాజ్యాధికారం సాధించేందుకు తీన్మార్ మల్లన్న కు తోడుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మీ రాజకీయాలను పాతరపెట్టేందుకు తీన్మార్ మల్లన్న టీం పనిచేస్తుందని స్పష్టం చేశారు. తీన్మార్ మల్లన్న పై చేసిన దాడిని ఖండించి కల్వకుంట్ల కవితపై, వారి అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు పాకాల దినకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దాస్యపు దీపక్ కుమార్, జిల్లా కార్యదర్శి , ఎల్తపు రాజశేఖర్, కార్యదర్శి పడాల శివతేజ,బీసీ జేఏసీ అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్, బీసీ సమాజ్ అధ్యక్షులు నేరేడ్ల శ్రీనివాస్, నామిని రాజన్న, ఎల్పుల వెంకటేష్, రాజనర్సయ్య, గడిపెల్లి వెంకటేష్, దుర్గం ప్రేమ్ , ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు ఉప్పరి నాగేష్, ఉపాధ్యక్షులు నిరంజన్, ప్రవీణ్ , చంద్రకాంత్, వివిధ బీసీ సంఘాల నాయకులు మేధావులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *