*గత 19 సంవత్సరాల నుండి మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్న శ్రీరామకోటి భక్త సమాజం*
*పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత: రామకోటి రామరాజు*
భగవంతుని సేవే మహా భాగ్యంగా భావించి గత 19సంవత్సరాల నుండి మట్టి గణపతులను తయారుచేసి పంపిణీ చేస్తున్న గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ. మట్టి గణపతులను వాడి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిది అని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు గారు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత 19సంవత్సరాల నుండి నిర్విరామంగా మట్టి గణపతులను తయారుచేసి భక్తులకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం కూడా పర్యావరణాన్ని గురించి వివరించి, ప్రచారాన్ని నిర్వహించి ప్రతి ఒక్కరికి మట్టి గణపతులను అందజేస్తామన్నారు. ప్లాస్టరప్ ప్యారిస్ తో తయారైంది విగ్రహాల వల్ల చేపలు ఇతర జీవరాసులకు ముప్పు కలుగుతుంది. అందుకే మట్టి గణపతులే శ్రేయస్కరం అన్నారు. అన్ని విజ్ఞాలు పోవడానికి వినాయకున్ని పూజిస్తాము. ఏ కార్యాన్ని ప్రారంభించాలన్నా ముందుగా గనాథుని పూజలు చేస్తామని తెలిపారు.
స్వయంగా గణపతులను తయారుచేసి ఉచితంగా అందజేస్తున్నామన్నారు. గత 19సంవత్సరాల క్రితం 20గణపతులతో ప్రారంభించి నేడు వేలాది గణపతులను తయారుచేసి అందజేస్తున్నామని సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు గారు అన్నాప్రు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు.