సింగరేణి ప్రాంతంలోని వర్కింగ్ జర్నలిస్ట్ లకు ఖాళీగా ఉన్న క్వాటర్లను కేటాయించాలి.
… రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేసిన టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు.
మంచిర్యాల, జూన్ 12.
సింగరేణి ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఆయా ప్రాంతాల్లో ఖాళీ గా ఉన్న సింగరేణి క్వార్టర్లను కేటాయించాలని కోరుతూ కార్మిక ,ఉపాధి కల్పనా, పరిశ్రమల, భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కి శనివారం రాత్రి టి డబ్ల్యూ జెఎఫ్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టి యు డబ్ల్యూ జేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మిట్టపల్లి మధు, గడ్డం సత్యగౌడ్ లు మాట్లాడుతూ సింగరేణి ఏరియాలో వివిధ పత్రికలలో పనిచేయుచున్న జర్నలిస్టులు అద్దె నివాసాలలో జీవనాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాములో కొందరికి నివాస స్థలాలను కేటాయించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని, . ప్రస్తుతం మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఆశలు చిగురించాయని అన్నారు. చాలామంది జర్నలిస్ట్ లు, ఎలాంటి వేతనము లేకుండా సింగరేణి సంస్థ, ప్రభుత్వ కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో నిరంతరము కృషి చేయుచున్నారని తెలిపారు. సింగరేణి ప్రాంతంలో చాలా కాలంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఆయా ఏరియాలో ఖాళీగా ఉన్న క్వార్టర్లను కేటాయించినట్లయితే వారి కుటుంబాలకు ఆర్థికంగా అద్దె భారం నుండి వారు విముక్తి చెందుతారని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ విలేకరుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాద్యాక్షడు కామెర వెంకటస్వామి, కోశాధికారి సబ్బాని బాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల షానగొండ శ్రీనాథ్, జాయింట్ సెక్రెటరీ లు సుమన్, సురేష్, సభ్యులు
షతీష్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
