Breaking News

నీళ్లు కలిపిన పెట్రోల్​ – వాహనదారుల ఆందోళన

367 Views

నీళ్లు కలిపిన పెట్రోల్​ – వాహనదారుల ఆందోళన

పెట్రోల్‌ నిల్వల్లో 10 శాతం ఇథనాల్‌

ఇథనాల్‌తో నీళ్లుగా మారుతున్న పెట్రోల్‌

ఎల్లారెడ్డిపేట మార్చి 20 ;

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని భారత్ పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ బయటపడింది , పెట్రోల్‌ బంకుల నిర్వహణలో నిర్లక్ష్యం వినియోగదారులకు శాపంగా మారింది.నీళ్లు కలిపిన పెట్రోల్​ పోయించుకున్న వాహనాలు మొరాయించడంతో మెకానిక్​ వద్దకు తీసుకెళ్లగా అసలు విషయం బయటపడుతుంది,
వంద దాటిన పెట్రోల్​ ధరలతో జనం బెంబేలెత్తిపోతుంటే దానికి కల్తీ పెట్రోల్​ కూడా తోడు అయింది. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లో గల భారత్ ఆయిల్ పెట్రోల్ బంక్​లో పెట్రోల్​లో నీళ్లు వచ్చాయని గుండారం గ్రామానికి చెందిన వాహనదారులు ఆందోళనకు దిగారు. బంక్ వారిని ఇదేమిటని ప్రశ్నిస్తే అది అంతే అంటున్నారని ఆయిల్‌ కంపెనీల నుంచి ఇథనాల్‌తో కూడిన పెట్రోల్‌ సరఫరా నిల్వలు దెబ్బతీస్తున్నాయి. ఇథనాల్‌ మిళితమైన పెట్రోల్‌ నిల్వల్లో నీటిచుక్క కలిసినా…క్రమంగా పెట్రోల్‌ మొత్తం నీరుగా మారుతోంది.గుండారం గ్రామానికి చెందిన గూడెపు సత్యాలాల్ రూ.200 ల పెట్రోల్ కొట్టించుకుంటే ఇంటికి వెళ్లేసరికే బండి ఆగిపోవడంతో మెకానిక్ వద్దకు తీసుకుపోతే ఆయనకు అసలు విషయం తెలిసింది. బొప్పాపూర్ లోని ఈ పెట్రోల్ పంప్​లో వాటర్ రావడం తరచుగా జరుగుతుందని, ఈ బంకుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. సివిల్ సప్లై అధికారులు, తూనికలు కొలతల అదికారులు పెట్రోల్​ను పరీక్షించాలని కాంగ్రెస్ పార్టీ యూత్ అద్యక్షులు బానోత్ రాజు నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి లు కోరుతున్నారు

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7