మంచిర్యాలలో డా. వైఎస్ ఆర్ 76 వ జయంతి వేడుకలు.
మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే వారి నివాసంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కీ,, శే,,డా,, శ్రీ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా వారి చిత్రం పటానికి నివాళులు అర్పించి, కేక్ కట్ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ , కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి నాకు అత్యంత సన్నిహితులు, ఈరోజు వారు లేకపోవడం చాలా బాధాకరం అన్నారు.ముఖ్యమంత్రిగా వైఎస్ ఆర్ అందించిన సేవలు ప్రజల హృదయాల్లో చిరకాలం నిలిచిపోతాయి తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
