మంచిర్యాల జిల్లా. నస్పూర్ మున్సిపాలిటీ.
నస్పూర్ మున్సిపాలిటీ 7 వ వార్డు లో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాఫీ పంపిణీ కార్యక్రమం.
నేడు నస్పూర్ మున్సిపల్ 7 వ వార్డ్ లో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నరిగె నరేష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కృషి చేయాలి అని అన్నారు. కమిటీలను ఏర్పాటు చేసి, వారి ద్వారా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చీడం మహేష్ , వార్డ్ ఇన్చార్జ్ మరియు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అద్యక్షులు నరిగె నరేష్ ,వార్డ్ అధ్యక్షులు భీమిని రాజేష్ ,లలిత , రమేష్ ,రాములు ,పోషం, మరియు మెరుగు సతీష్ తదితరులు పాల్గొన్నారు.
