మంచిర్యాల జిల్లా, భీమారం మండలం.
భీమారం ఆశ్రమ పాఠశాల నిధుల దుర్వినియోగం పై ఫిర్యాదు.
అమ్మ ఆదర్శ పాఠశాల నిధులు 1250000 రూపాయలు దుర్వినియోగం పై ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి ఉట్నూర్ కు ఫిర్యాదు చేసిన కోయ సంఘం జిల్లా కన్వీనర్ ఆలం బాపు, పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు మాడే మధునయ్య, బానేష్ సుజాత మరియు పోషం.
నేను అనగా మాడే మధునయ్య తండ్రి సన్యాసి నివాసం ముక్కిడిగూడెం గ్రామం, వేమనపల్లి మండలం, మంచిర్యాల జిల్లా. నా కుమారుడు మాడే శ్రీరామ్ తండ్రి మదనయ్య 6 తరగతి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల భీమారం యందు చదువుతున్నాడు, నేను పేరెంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. భీమార మండలంలో కేంద్ర ప్రభుత్వ పథకం అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా 12 లక్షల 50 వేల రూపాయలు మంజూరు అయినాయి. ఇట్టి నిధులను పాఠశాల మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఉపయోగించాలి. కానీ ఇట్టి నిధులు దుర్వినియోగం జరిగింది. క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గుగులోత్ మల్లేష్ ఇట్టి నిధులను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా ఇట్టి నిధుల దుర్వినియోగంలో కుమ్మక్కైనట్టుగా ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాఠశాలకు మౌలిక సదుపాయాలు కూడా కరువైనాయి. పిల్లలు మిషన్ భగీరథ నీళ్లను తాగుతున్నారు. భోజనాలు వన్డే వంటశాల కూడా పారిశుధ్యం లోపించింది. వంటశాల పైకప్పు రేకులు గాలి దుమారానికి కొట్టుకొని పోయిన కూడా సంబంధిత అధికారులు మరమ్మత్తులు చేపట్టలేదు. దీంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఇబ్బందికి గురవుతున్నారు.
ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులు కోయ సంఘం జిల్లా కన్వీనర్ ఆలం బాపు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి 10 కేజీల పాలిథిన్ కవర్ తన సొంత డబ్బుతో కొని వంటశాల పైకప్పును తాత్కాలికంగా ఏర్పాటు చేయించారు. ప్రధానోపాధ్యాయుడు ఎల్ శంకర్ బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడంతో పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా విద్యార్థులకు అందడం లేదు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు మద్యం సేవించి తన విధులను నిర్వహిస్తున్నాడు. ప్రధానోపాధ్యాయులు సిబ్బందిని క్రమశిక్షణలో పెట్టకపోవడంతో వాళ్ళ ఇష్టారాజ్యం గా మారి విద్యార్థులకు పారిసిద్ద నీరు మరియు సరైన భోజనం అందడం లేదు. కాబట్టి అమ్మ ఆదర్శ పాఠశాల నిధుల దుర్వినియోగంపై మరియు ప్రధానోపాధ్యాయుడిపై సంబంధిత అధికారులు తక్షణమే తగు చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా పేరెంట్స్ కమిటీ తరపున తమరిని కోరుచున్నాము.
