*సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలానికి ఇన్చార్జిగా తుమ్మ మధు నియామకం : సీసీఆర్*
గజ్వేల్ నగరం లో కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (సీసీఆర్) ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సెంట్రల్ కమిటీ సభ్యుడు సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి వరకు సమాచార హక్కు చట్టం-2005 ను తీసుకెళ్లి, ప్రజలకూ అవగాహన కల్పించడానికి కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (సీసీఆర్)కృషి చేస్తుందన్నారు.
సీసీఆర్ సంస్థ పాలసి మేరకు సంస్థ ఆధ్వర్యంలో వివిధ సామాజిక, అవినీతి నిర్మూలన & ప్రజా ప్రయోజనార్థం.. కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని, సమాజానికి సేవ చేసిన సభ్యులను గుర్తిస్తూ, గౌరవిస్తూ వివిధ బాధ్యతలను మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ కమిటీలలో నియమించడంలో ముందుంటుందని తెలిపారు. సీసీఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు మంచికట్ల అనిల్ కుమార్ సూచనలు మేరకు గుండ్ల శివచంద్రం, సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు గజ్వేల్ మండలానికి తుమ్మ మధును ఇన్చార్జిగా నియమించడం జరిగిందన్నారు.
*ముఖ్యంగా పౌరులు తమకున్న హక్కులతో పాటు, తమ బాధ్యతలు విధులు పట్ల కూడా అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో ఉన్న యువతీ యువకులు, విద్యావంతులు, మేధావులు సమాచార హక్కు చట్టం పై అవగాహన పెంచుకొని తద్వారా గ్రామస్థాయి నుండి తమ గ్రామాలను మెరుగైన దిశలో అభివృద్ధి పరుచుకొనుటకు కంకణ బద్ధులు కావాలని సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు*.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండవలసిన రికార్డులు, ప్రస్తుతం అవి ఉన్న తీరు తెన్నులు గమనించి తన గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించుకోవడానికి శ్రీకారం చుట్టాలి అన్నారు.
స్టేట్ జాయింట్ సెక్రెటరీ గుండ్ల శివచంద్ర మాట్లాడుతూ మెరుగైన భారతదేశం కోసం చేస్తున్న కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానం ద్వారా అనేకమంది సభ్యులుగా చేరుతున్నారు. అవినీతి అలసత్వ నిర్మూలన ప్రధాన లక్ష్యంగా కొనసాగుతున్న ఈ ఉద్యమంలో భారత పౌరులందరికీ ఆహ్వానం ఉన్నట్లు తెలిపారు. ఈ సమాచార హక్కు చట్టం 2005 ఆవిర్భవించి 18 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా చాలా ప్రజలకు పట్టణ స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు తెలియకపోవడం బాధాకరమని, గ్రామీణ స్థాయిలో ఎక్కువ శాతం ప్రజలకు దరఖాస్తును కూడా నింపడానికి అవగాహన లేకపోవడం బాధాకరమని తెలిపారు. సంస్థ నియమ, నిబంధనలను అనుసరించి కార్యక్రమాలు చేపడుతామని తుమ్మ మధు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ సాజిద్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ ఇలియసుద్దిన్ కేతోజు వినోద్. యాకూబ్. సభ్యులు పాల్గొనడం జరిగింది.
