ప్రాంతీయం

మంచిర్యాలలో వందే భారత్ రైలు నిలుపుదల చేయాలని రైల్వే జీఎం కి వినతి పత్రం

14 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాలలో వందే భారత్ రైలు నిలుపుదల చేయాలని రైల్వే జీఎం కి వినతి పత్రం అందించిన ఎమ్మెల్సీ అంజి రెడ్డి  మరియు రఘునాథ్ వెరబెల్లి.

సికింద్రాబాద్- నాగ్ పూర్ మధ్య నడిచే వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి మరియు బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. మంచిర్యాల రైల్వే స్టేషన్ NSG 3 కేటగిరీ లో ఉంది ఏడాదికి 23 కోట్ల రూపాయల పైగా ఆదాయం మరియు 13 లక్షలకు పైగా ప్రయాణికులు వెళ్తున్నప్పటికీ ఇక్కడ వందే భారత్ రైలు మాత్రం నిలువడం లేదని వారికి వివరించారు. మంచిర్యాల జిల్లా నుండి అనేక మంది వ్యాపారస్తులు మరియు ప్రజలు నిత్యం నాగ్ పూర్ మరియు సికింద్రాబాద్ వెళ్తూ ఉంటారని మంచిర్యాలలో రైలు నిలుపుదల చేస్తే రైల్వేకు ఆదాయంతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని అంజిరెడ్డి తెలిపారు. మంచిర్యాల రైల్వే స్టేషన్ కంటే రామగుండం రైల్వే స్టేషన్ NSG 4 కేటగిరీ లో ఉండి ఆదాయం మరియు ప్రయాణికులు తక్కువ ఉన్న అక్కడ వందే భారత్ రైలు నిలుపుతున్నారని రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లనే మంచిర్యాల లో వందే భారత్ రైలుకు హాల్టింగ్ లభించడం లేదని రఘునాథ్  తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ , బెల్లంకొండ మురళి  పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్