ప్రాంతీయం

రహీమ్ బ్లడ్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో రక్త కణాల దానం

121 Views

మంచిర్యాల జిల్లా.

రహీమ్ బ్లడ్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాప కి అత్యవసర సమయంలో రక్త కణాలు దానం చేసిన మొహమ్మద్ అమాన్.

మంచిర్యాల పట్టణంలో ఈ వ్యక్తి తెలియని వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అందరితో ఆప్యాయంగా ఉంటూ,ఏ సమయంలో అయిన, ఎక్కడైనా రక్తం అవసరం అని ఫోన్ చెయ్యగానే ఎలాంటి సందర్భంలో ఉన్న వెంటనే స్పందించి రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రహీమ్ బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపడు అబ్దుల్ రహీమ్.

మంచిర్యాల పట్టణంలోని గవర్నమెంట్ మాత శిశు హాస్పటల్ లో చికిత్స పొందుతున్న ఫాతిమా అను మహిళ బేబీ కి జన్మ నిచ్చి మూడు రోజు మాత్రమే అవుతుంది.

మూడు రోజుల బేబీ అఫ్ ఫాతిమా కి అనారోగ్య తో బాధపడుతున్న సమయం లో మంచిర్యాల జమా మస్జీద్ చెందిన మొహమ్మద్ మాస్కూర్ అహ్మద్ ఇమామ్, మరియు రామకృష్ణాపూర్ చెందిన జమా మస్జీద్ ప్రెసిడెంట్ మొహమ్మద్ పాషా అట్టి విషయం బేబీ అఫ్ ఫాతిమా కి అత్యవసర చికిత్స నిమిత్తం *ఓ పాజిటివ్ రక్త కణాలు అవసరం అని పేషెంట్ కుటుంబ సభ్యులు డోనర్ కోసం వెతుకుతున్న సమయం లో వీరు మంచిర్యాల జిల్లా రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ వ్యవస్థాపకుడు అబ్దుల్ రహీమ్ కి అర్థం రాత్రి 12 గంటలకు కాల్ చేసి అట్టి విషయం 3 రోజుల పుట్టిన బేబీ కి రక్త కణాలు అవసరమని చెప్పడంతో వెంటనే అట్టి సమాచారాన్ని తన బ్లడ్ గ్రూపు లిస్ట్ లో వేయడం తో.. రాజీవ్ నగర్ కి చెందిన మొహమ్మద్ అమాన్ నేను రక్త కణాలు ఇస్తా అని వెంటనే స్పందించి, అమృత్ బ్లడ్ సెంటర్ కి 3 గంటలకు వచ్చి రక్త కణాలు ఇవ్వడం జరిగింది.

అత్యవసర సమయంలో మొట్ట మొదటి సారి  రక్త కణాలు దానం చేసి ప్రాణదాతగా నిలిచిన మొహమ్మద్ అమాన్ ని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, తన మిత్ర బృందం, మరియు రహీమ్ బ్లడ్ ఆర్గనైజషర్ అబ్దుల్ రహీమ్ మరియు పేషెంట్ బంధువులు, అభినందించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్