ప్రాంతీయం

భారత రాష్ట్రసమితి విద్యార్థి విభాగం.. ముందస్తు అక్రమ అరెస్ట్…

127 Views

 ముస్తాబాద్, ప్రతినిధి జూలై 15 (24/7న్యూస్ ప్రతినిధి): డీఎస్సీని వాయిదావేసి గ్రూప్ 2,3 పోస్టుల సంఖ్య పెంచాలని సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. దీనికి భారత రాష్ట్రసమితి వారికి పూర్తిగా మద్దతు ఇందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత రాష్ట్రసమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ పేరిట సచివాలయ ముట్టడికి వెళ్లడం జరుగుతుందని ముందస్తు సమాచారంతో పోలీసులు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులను వేకువజామున ముందస్తు అక్రమ అరెస్టులు చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ ముందస్తు అరెస్టులు చేయడం బాధాకరమని నిరుద్యోగుల సమస్యల పైన పట్టించుకోవడం మానేసి నిరుద్యోగుల పక్షాన భారత రాష్ట్రసమితి మద్దతు ప్రకటిస్తే ఇలా అక్రమ అరెస్టులు చేయడం చాలా శోచనీయమని శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే వారిని అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని వారికి మద్దతు తెలిపే వారిని కూడా ఎక్కడికక్కడ అరెస్టు చేయడం చాలా సిగ్గుచేటు అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వెంటనే డీఎస్సీని వాయిదా వేసి మెగా డీఎస్సీ నిర్వహించాలని గ్రూప్-2-3 పోస్టులు పెంచాలని జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ మీరు చెప్పిన విధంగా మొదటి ఏడాదిలోనే రెండులక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరుపున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం హెచ్చరిస్తున్నామని పేర్కొన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్రాసమితి విద్యార్థి విభాగం తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన వెన్నంటి ఉంటామని తెలియజేస్తామన్నారు. వారితో అరెస్టు అయిన వారు నాయకులు సబ్బని హరీష్, మట్టే శ్రీనివాస్, చోటు.రోహిత్ .కోడం వెంకటేష్, కోడి సాయి రోహిత్, జయచంద్ర.వినయ్ తదితరులు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7