ప్రాంతీయం

మంచిర్యాల – అంతర్గం గోదావరిపై వంతెన నిర్మించాలని బిజెపి డిమాండ్

18 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల వద్ద గోదావరి పై వంతెన నిర్మిస్తే పేద ప్రజలకు ఆర్ధిక భారం తగ్గుతుంది – రఘునాథ్ వెరబెల్లి

మంచిర్యాల – అంతర్గాం మధ్య గోదావరి పై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల గోదావరి వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి  మరియు జిల్లా అధ్యక్షులు నాగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునాథ్  మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలంలోనే గోదావరి పై వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ వంతెన నిర్మిస్తే బస్ లో వెళ్లే పేద ప్రజలు ఒక్కొక్కరికి రానుపోను 100 రూపాయల మిగులుతాయని అన్నారు. ఇక్కడ వంతెన నిర్మించకపోవడం వల్ల ఏడాదిలో 80 నుండి 100 కోట్ల రూపాయల వరకు ప్రజల పై భారం పడుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే పది సంవత్సరాలు వంతెన నిర్మాణం చేపట్టకుండా కాలయాపన చేస్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తన స్వార్థ ప్రయోజనాల కోసం కమిషన్లకు కక్కుర్తి పడి ఇక్కడ వంతెన నిర్మించకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే మంచిర్యాల- అంతర్గం మధ్య వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ వంతెనకు గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఇంకో వంతెన ముల్కల్ల వద్ద నిర్మాయించాని అనుకుంటే ఎమ్మెల్యే నిధులు మంజూరు చేసి వంతెన నిర్మాణం చేపట్టాలని అన్నారు. మంచిర్యాల- అంతర్గం మధ్య వంతెన నిర్మాణం వెంటనే ప్రారంభించాలని డిమాండ్.

ఈ కార్యక్రమంలో అమిరిశెట్టి రాజ్ కుమార్, పెద్దపల్లి పురుషోత్తం, గాజుల ముఖేష్ గౌడ్, బియ్యాల సతీష్ రావు, పానుగంటి మధు, పట్టి వెంకట కృష్ణ, మోటపలుకుల తిరుపతి, ఆకుల అశోక్ వర్ధన్, జోగుల శ్రీదేవి, మాదవరపు వెంకట రమణ రావు, బొలిశెట్టి అశ్విన్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, కోడి రమేష్, మోతె సుజాత, కర్ర లచ్చన్న, సత్రం రమేష్, గడ్డం స్వామి రెడ్డి, హేమంత్ రెడ్డి, బోయిని హరి కృష్ణ, గురువయ్య, గుండా ప్రభాకర్, రాకేష్ రెన్వ, పచ్చ వెంకటేశ్వర్లు, ఈర్ల సదానందం, గాజుల ప్రభాకర్, కమలాకర్ రావు, వైద్య శ్రీధర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్