ముస్తాబాద్, జూన్ 14 (24/7న్యూస్ ప్రతినిధి): బంధనకల్ గ్రామంలో నేడు నిర్వహించిన పాలసేకరణ కేంద్రంలో ఏకగ్రీవ చైర్మన్ గా నల్ల శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈసందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి చైర్మన్ గా ఎన్నుకున్నందుకు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపి పాడి రైతుల అభివృద్ధి కోసం, పాడి రైతుల సంక్షేమం కోసం పాటుపడుతానని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బందనకల్ గ్రామ పాలఉత్పత్తి దారులు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.
