మంచిర్యాల జిల్లా.
మంచిర్యాలలో ఎక్కడ గొడవ జరిగిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కు అంటగడుతున్నారు.
మంచిర్యాలలో ఎక్కడ గొడవ జరిగినా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కు అంటకట్టడం విపక్షాల కు రివాజుగా మారిందని కాంగ్రెస్ నేతలు అన్నారు. గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు, కౌన్సిలర్ గాజుల ముఖేష్ గౌడ్, మిట్టపల్లి లక్ష్మి పై డీసీపీ భాస్కర్ కు ఫిర్యాదు చేశారు. మిట్టపల్లి జయరామ్ రావుపై దాడి ఘటనను ఎమ్మెల్యేపై రుద్దేందుకు వారు ప్రయత్నం చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు తిరుపతి ఆరోపించారు. వ్యక్తిగత గొడవలు, భూతగాదాలను ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతున్నాయని అభియోగించడం శోచనీయమని అన్నారు.
జయరామ్ పై దాడికి ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. జయరామ్ రావుపై ఉదయం దాడి జరిగితే రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యేను ప్రజల్లో పలుచన చేయడానికి బీజేపీ, బీఆరెస్ రెండు విపక్షాలు సంయుక్తంగా కుట్ర పన్నాయని ధ్వజమెత్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉబలాట పడిన రఘునాథ్ రావుకు టికెట్ రాకపోవడంతో మతిభ్రమించి ఎమ్మెల్యే పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ శ్రేణులను క్రమ శిక్షణలో ఉంచుతున్నారని శ్రేణులు గీత దాటే విధంగా ప్రేరేపితం చేయవద్దని కోరారు. చట్టం తన పని చేసుకుపోతుందని తప్పు చేసే వారికి శిక్ష పడుతుందని అన్నారు.





