1కేజీ 550 గ్రాముల గంజాయి స్వాధీనం
తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామ శివారులో అక్రమంగా గంజాయి అమ్ముతున్న నిందుతుడు అరెస్ట్ సిరిసిల్ల రూరల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన రూరల్ సి.ఐ ఉపేందర్.గంజాయి నిందుతుని వివరాలు.
1.గడ్డం నాగేశ్ s/o బాలరాజు, వయస్సు 21 సంవత్సరాలు, r/o బి.వై నగర్ సిరిసిల్ల.ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ
తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామం శివారులో గంజాయి అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు తంగళ్ళపల్లి ఎస్.ఐ లక్ష్మారెడ్డి తన సిబ్బందితో కలసి అక్కడికి వెళ్లిగా అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపించగా అట్టి వ్యక్తిని సుమారు ఉదయం 10:30 గంటల సమయంలో పట్టుకొని తనిఖీ చేయగా అతని వద్ద 01 కేజీ 550 గ్రాముల గంజాయి దొరకగా అట్టి వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించగా నాందేడ్ లోని గుర్తు తెలియని వ్యక్తుల వద్ద కొనుగోలు చేసి జిల్లా కి తీసుకువచ్చి అక్రమంగా అమ్ముతున్నామని తెలుపడం జరిగింది. ఇట్టి వ్యక్తి పై తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించనైనది అని సి.ఐ ఉపేందర్ తెలియజేశారు.ఇట్టి గంజాయి నిందితులను పట్టుకోవడం లో ప్రముఖ పాత్ర పోషించిన ఎస్.ఐ లక్ష్మారెడ్డి,పోలీస్ సిబ్బంది నరేందర్,తిరుపతి ,శ్రీనివాస్,రామ్మోహన్, రాజేంద్రప్రసాద్,తడెం స్వామి,లను సి.ఐ అభినందించారు..
గంజాయి మరియు ఇలాంటి మత్తు పదార్థాలను సరఫరా చెయ్యడం తగడం చట్ట రీత్యా నేరం గంజాయి సంబంధిత సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ వారికి లేదా డయల్ 100 కి సమాచారం అందించాలని కోరారు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి అన్నారు
ఈ సమావేశంలో ఎస్.ఐ ఎస్.ఐ లక్ష్మారెడ్డి,పోలీస్ సిబ్బంది నరేందర్,రాజేంద్రప్రసాద్,తడెం స్వామి,రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు..
