ముస్తాబాద్/అక్టోబర్/10; మండల వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం రోజున ముస్తాబాద్ మండలం గూడెం అవునూర్ ఆరోగ్య ఉపకేంద్రాలలో పరీక్ష శిబిరాలు నిర్వహించమన్నారు గతంలో కరోణ బారిన పడిన మధుమేహం దీర్ఘకాలిక వ్యాధులు క్షయ వ్యాధి లక్షణాలు ఉన్నవారికి వారికి నమూనాలను సేకరించారు. ఇందులో వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచిత చికిత్స ఇచ్చి NPY పథకం కింద నెలకి 500 రూపాయలు చొప్పున ఆరు నెలలపాటు ఇ
వ్వనున్నట్లు తెలిపారు. అలాగే ముస్తాబాద్ మండల ప్రజలు ఎవరికైనా క్షయ వ్యాధి లక్షణాలు రెండు వారాలకు మించి దగ్గు జ్వరం ఆకలి లేకపోవడం బరువు తగ్గడం లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్ష చేయించుకోవాలని సూచించారు. అలాగే అన్ని ఆరోగ్య ఉపకేంద్రాలలో టీవీ శిబిరాలు నిర్వహించబడునని ప్రజలు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది పేర్కొన్నారు. ఈశిబిరాలలో Senior Treatment Supervisor G.Mahipal, TB నోడల్ పర్సన్ సిహెచ్ లక్ష్మీప్రసాద్, ఏఎన్ఎం, ఆశాలు పాల్గొన్నారు.




