- ఆర్ ఎస్.ప్రవీణ్ కుమార్ ఆమరణ నిరాహార దీక్ష వల్లే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు గజ్వేల్ బి ఎస్ పి నాయకులు నిరసన
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష పత్రాల లీకేజీ పై నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష మరియు చైర్మన్ జనార్దన్ రెడ్డి హయాంలో జరిగిన ప్రవేశ పరీక్షలన్నీ రద్దు చేయాలని ,పేపర్ లీకేజీ కేసును సిబిఐకి అప్పగించి సమగ్ర విచారణ జరిపించాలని జనార్దన్ రెడ్డి చైర్మన్ పదవి నుండి వైదొలగాలని డిమాండ్ చేస్తూ, 30 లక్షల తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం చేయడం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అరెస్ట్ ను ఖండిస్తూ నిరసన తెలిపితే అక్రమంగా గజ్వేల్ బీఎస్పీ నాయకులను తరలించిన పోలీసులు. అనంతరం .ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని సిద్ధిపేట బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్ అన్నారు. జిల్లా కార్యదర్శి కొండనోళ్ళ నరేష్ , బాగానోళ్ళ రామ చంద్రం,నియోజకవర్గ అధ్యక్షులు గూడూరి కరుణాకర్ , ఉపాధ్యక్షులు గుర్రం ఎల్లం, కోశాధికారి జోడుమంతల నవీన్,మండల మండల అధ్యక్షులు ఆశని కనకప్రసాద్ జగదేవపూర్ మండల అధ్యక్షులు కె అశోక్ , బి వి ఎఫ్ నాగరాజు ,అనిల్, వంశీ,నాగరాజు, గణేష్ పాల్గొన్నారు





