ముస్తాబాద్, ఏప్రిల్ 5 (24/7న్యూస్ ప్రతినిధి): మండల పరిధిలోని ట్రాక్టర్ డ్రైవర్లు మరియు యజమానులతో ఠాణాలో ఎస్ఐ సిహెచ్. గణేష్ సమావేశం నిర్వహించి వారికి పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సిహెచ్, గణేష్ మాట్లాడుతూ లైసెన్స్ లేని డ్రైవర్లను, ఇంజిన్ మరియు ట్రైలర్ రెండింటికీ సరైన నంబర్ ప్లేట్ సరైన పత్రాలు ఉండాలి, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు, మితిమీరిన వేగం నిబంనలకు లోబడి ఉండాలి, అక్రమ ఇసుక మరియు కంకర రవాణా చేయకూడదు ట్రాఫిక్ నియమాలు పాటించకుండా ఇవేం పట్టించుకోకుండా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పువని తెలిపారు.
