ఆధ్యాత్మికం

నేత్ర పర్వంగా రాములోరి కళ్యాణం…

251 Views

ముస్తాబాద్, ఏప్రిల్ 6 (24/7న్యూస్ ప్రతినిధి): జగదానందకారకుడు. జగదాభిరాముడు.. జానకి రాముడు.. సర్వాంగ సుందరంగా ముస్తాబై కల్యాణ వేదికపై చిద్విలాసం చేశారు. మండలంలోని బంధనకల్ గ్రామంలో సనాతన భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలు అనుసరించి సీతారాముల వారి కోదండ రామయ్య రమణీయంగా అలంకృతుడై పెళ్లి వేదికన చేరుకున్నారు. జనక మహారాజు పుత్రిక లక్ష్మీ స్వరూపిని సద్గుణ సమ్మోహన స్వరూపం లోకాపావని ధర్మదేవత సీతమ్మ నవవదుగా కళ్యాణ శోభతో కదలి వచ్చారు. జగదానందకారుడు రామయ్యను, జానకమ్మకు ముందుగానే రెడ్డి సంఘం అధ్యక్షులు కస్తూరి పద్మారెడ్డి ఆధ్వర్యంలో సంఘ సభ్యులు కుటుంబ సమేతంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం గంగాజలాలతో స్నానాలు చేయించి వేదికపై నేత్రపర్వంగా బహుసుందరంగా ముస్తాబుచేశారు. రెడ్డి సంఘం భక్తులు పట్టువస్త్రాలు, పుష్ప మాలికలు, ఆభరణాలతో అలంకరించారు. వేద పండితులచే మంత్రోచ్ఛారణలు, జయ జయ ద్వానాల నడుమ రాముడు సీతమ్మ మెడలో మూడు ముళ్ళువేసే సమయాన ముల్లోకాలు మురిసాయి. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7