ప్రాంతీయం

కారు బోల్తా… ఒకరు మృతి… పలువురికి గాయాలు

102 Views

దౌల్తాబాద్: కారు బోల్తా పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా తూప్రాన్ కు చెందిన మద్దినేని సచిన్ కుమార్ (18) సోమవారం దౌల్తాబాద్ లో బంధువుల రిసెప్షన్ కు స్నేహితులతో కలిసి వచ్చారు. తిరిగి వెళుతుండగా క్రమంలో కారు అతివేగంగా అజాగ్రత్తతో నడపడంతో అదుపుతప్పి బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. వారిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సచిన్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుని తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Oplus_131072
Oplus_131072
Jana Santhosh