ముస్తాబాద్, ఏప్రిల్ 5 (24/7న్యూస్ ప్రతినిధి): కులరహిత సమాజంకోసం అట్టడుగు వర్గాల హక్కులకోసం నిరంతరం పోరాడిన భారతదేశ మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి118వ జయంతి మండల పరిధిలోని తుర్కపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఆమహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకు హక్కులను ప్రసాదిస్తే, వాటిని చట్టరూపంలో తీసుకురావడానికి కృషి చేసిన కార్మిక మరియు వ్యవసాయశాఖ మంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించిన బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయ సాధనలో మనమందరం ముందుండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాశోల్ల పద్మ దుర్గాప్రసాద్, పంచాయతీ కార్యదర్శి, గ్రామశాఖ అధ్యక్షులు జోగెల్లి నాగరాజు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మల్లేష్, మచ్చ లింగం, రాజనర్సు, రామస్వామి, ఎల్లయ్య,లక్ష్మణ్, కృష్ణ, ప్రశాంత్, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది, ఆశావర్కర్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
