ముస్తాబాద్, ఫిబ్రవరి 26 (24/7న్యూస్ ప్రతినిధి): యాసంగి సీజన్‌లో రైతులు సాగు చేసిన పంటలకు నీరందక ఎండిపోతున్నా ఎవరు పట్టించుకోరా.. బంధనకల్ గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించే వారేరని రైతులం తెచ్చినప్పులు ఎలా తీర్చాలంటున్నామన్నారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ ఎన్నో కష్టాలుపడి లక్షలు వెచ్చించి పంటలుసాగు చేస్తున్నామని తీరా పంటచేతికొచ్చే సమయంలో నీరందక ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం దేవుడెరుగు గాని.. వంటలు ఎండాక నష్టం ఇస్తామనుడేనా.. ప్రజాపాలన అంటే ఇదేనా.. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రైతులు కూలీలుగా తెలంగాణ ప్రజలు పొట్టకూటి కొరకు కుటుంబాలను వదిలి విదేశాలు మొదలుకొని వివిధ ప్రాంతాలకు వలసవెళ్లి వెట్టిచాకిరి చేసి చాలీచాలని వేతనాలతో కొందరు కుటుంబంమెల్లక అక్కడే తనువు చాలించారు. ఇవన్నీ ఆలోచించి నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజలు ఎవరికి బానిసలు కావద్దని బీటువారిన భూములు పచ్చదనంతో పాడిపంటలు పండించి మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లాలని మండువేసివిలో కూడా చెరువులన్నీ నిండుకుండలా నింపి రైతుల కళ్ళలో ఆనందం నింపారన్నారు. నేడు ఈ ప్రభుత్వం మార్పు అంటే రైతు కళ్ళల్లో నీళ్లా అని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాపతినిధులు అధికారులు చొరవ తీసుకొని బంధనకల్ లోని ఎండుతున్న పంటలను చూసి అడుగంటుతున్న చెరువు నింపుతే గాని పంటలు చేతికి రావని చేతులెత్తి మొక్కుతున్నారు.
